: 130 కోట్ల మందిని ఆనందంలో ముంచెత్తిన సింధు...సోషల్ మీడియా నిండా సింధూయే!


130 కోట్ల మంది భారతీయులను పీవీ సింధు ఆనందంలో ముంచెత్తింది. రియో ఒలింపిక్స్ లో ప్రతికూల పవనాలు వీస్తున్న వేళ...ఆటగాళ్లంతా రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్న వేళ సింధు చూపిన పోరాట పటిమను వర్ణించేందుకు మాటలు సరిపోవంటే అతిశయోక్తి కాదు. దేశ మొత్తం ఆశగా చూస్తున్న వేళ, భారతీయులు సింధు పతకం తెస్తే బాగుంటుందని కోరుకుంటున్న సమయంలో కోర్టులో ఒత్తిడిని జయించడం సర్వసాధారణం కాదు. అలాంటి క్షణాల్లో అందరి ఆశలను మోస్తూ కోర్టులో దిగిన సింధు...భారతీయుల నుదుట సింధూరమై మెరిసింది. జపాన్ క్రీడాకారిణిని సాధికారిక ఆటతీరుతో ఓడించి, సగర్వంగా ఫైనల్స్ కి చేరింది. దీంతో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర నెలకొల్పింది. దీంతో సోషల్ మీడియా మొత్తం సింధు పేరుతో నిండిపోయింది. యావద్భారతావని ఆమె సాధించిన విజయంతో పులకించిపోతోంది. ఇదే స్పూర్తితో స్వర్ణం గెలవాలని కోరుకుంటోంది!

  • Loading...

More Telugu News