: మోకాలి గాయం చికిత్సకై హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన సైనా నెహ్వాల్
భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ ఆసుపత్రిలో చేరింది. రియోలో ఉక్రెయిన్ కు చెందిన మరియాతో తలపడుతుండగా సైనా మోకాలికి గాయమైన విషయం తెలిసిందే. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో సైనా చేరింది. ఈ సందర్భంగా ఆమె తండ్రి హర్వీందర్ సింగ్ మాట్లాడుతూ, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం ముంబై ఆసుపత్రికి తీసుకువెళ్తామని చెప్పారు.