: 'కబాలి'ని కాపీ కొట్టేందుకు ప్రయత్నించిన ధోనీ!


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను టీమిండియా స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ కాపీ కొట్టారు. వీళ్లిద్దరూ వేర్వేరు రంగాలకు చెందిన వారు కదా, ఇదెలా సాధ్యమనే అనుమానం తలెత్తుండొచ్చు. ఆ విషయంలోకి వెళితే, రజనీ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ స్టైల్ ను చూసిన వారెవరైనా సరే మనమూ అనుకరిస్తే బాగుంటుందనిపిస్తుంది. అదే భావన ధోనీకి వచ్చింది. అందుకనే ‘కబాలి’ చిత్రంలో సూటు బూటు తో పాటు కళ్ల జోడు ధరించి ఎంతో స్టైల్ గా సోఫాలో కూర్చున్న రజనీ మాదిరిగా ధోనీ కూడా ఒక ఖరీదైన చైర్ లో కూర్చున్నాడు. ఈ ఫొటోను ధోనీ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే, ఈ ఫొటోలో సూటు, టై ధరించిన ధోనీ కళ్లజోడు మాత్రం పెట్టుకోలేదు. మిగిలినదంతా ‘కబాలి’ లో రజనీ లా సేమ్ టూ సేమ్, అదే పద్ధతిలో పోజిచ్చాడు. తలైవార్ ను కాపీ కొట్టడానికి ప్రయత్నించానంటూ ధోనీ పోస్ట్ కూడా పెట్టాడు. కాగా, ధోనీ జీవిత కథతో రూపుదిద్దుకున్న ‘ఎంఎస్ ధోనీ’ చిత్రం వచ్చే నెల 30న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News