: శభాష్...సాక్షీ! దేశం గర్వించేలా చేశావు....వినేష్!... నువ్వు మా బిడ్డవి: సుష్మా స్వరాజ్
ఒలింపిక్ విజేతలకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో 58 కేజీల విభాగంలో కిర్గిజిస్థాన్ కు చెందిన క్రీడాకారిణిని ఓడించి కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ ను సుష్మా స్వరాజ్ అభినందించారు. దేశం గర్వించేలా చేశావని ప్రశంసించారు. 48 కేజీల విభాగంలో భారత్ తరపున పోటీ పడిన వినేష్ ఫోగట్ కాలును చైనా క్రీడాకారిణి విరిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'మానసికంగా, శారీరకంగా చాలా గాయపడ్డాను' అని ఆమె ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ దేశవ్యాప్తంగా ట్వీట్ల ద్వారా అభినందించిన వారిలో సుష్మా స్వరాజ్ కూడా చేరారు. 'వినేష్...నువ్వు మా బిడ్డవి. నీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా'మని ఆమె తెలిపారు.