: నయీమ్ ఆస్తులకు బినామీ నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ?
నయీమ్ ఆస్తుల కేసులో రాజకీయ నాయకుల పాపాలు ఒక్కొక్కటీ బట్టబయలవుతున్నాయి. నేరగాడు నయీమ్ అండతో ఎదిగిన ఓ ఎమ్మెల్సీ బాగోతం సిట్ అధికారులకు చిక్కినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్సీ పదవిని కాపాడుకునేందుకు పార్టీ మారాడని సమాచారం. ఇతనికి నయీమ్ పాపాల్లో భాగం ఉందని, నయీమ్ కు ఇతను బినామీగా ఉన్నాడని తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న ప్రభుత్వం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. మరోపక్క, పదవిని కోల్పోతే ఎలా? అనే ఆందోళనతో సదరు ఎమ్మెల్యే మధనపడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.