: ప్రతి హీరోయిన్ కు సైట్ కొట్టే కపిల్ శర్మకు 'రాఖీ' కట్టిన బాలీవుడ్ హీరోయిన్
హిందీ బుల్లితెర కామెడీ కింగ్ కపిల్ శర్మ బాలీవుడ్ నటితో రాఖీ కట్టించుకున్నాడు. 'కపిల్ శర్మ షో' పేరిట ఓ టీవీ చానెల్ లో ఆయన షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆద్యంతం హాస్యభరితంగా సాగే ఈ షోలో గత వారం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను వివాహం చేసుకుని, కపిల్ శర్మ తన కల నెరవేర్చుకున్నాడు. ఈ షోకు హాజరయ్యే ప్రతి హీరోయిన్ కు సైట్ కొట్టే కపిల్ శర్మకు తాజా ఎపిసోడ్ లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా రాఖీ కట్టింది. 'అకిరా' సినిమా ప్రమోషన్ కోసం కపిల్ షోకు వచ్చిన సోనాక్షి సెట్లో సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను అభిమానులతో పంచుకుంది.