: సినిమా హిట్...కాస్ట్యూమ్స్ ఫ్లాప్... 'రుస్తుం'పై సెటైర్!


నేవీ అధికారి నానావతి జీవిత కథ ఆధారంగా రూపొందిన అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అయినా కాస్ట్యూమ్స్ అట్టర్ ఫ్లాప్ అని ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సందీప్ ఉన్ని థాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇందులో కాస్ట్యూమ్ డైరెక్టర్ అపరిపక్వతను ఆయన అందరికీ తెలిసేలా చేశారు. 1959 నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర సీడీఆర్ రుస్తుం పావ్రీ (నానావతి) ధరించిన నేవీ యూనిఫామ్‌ పై అడ్డగోలు పతకాలు పెట్టేశారు. ఈ మెడల్స్ లో ఇటీవల కాలానికి చెందినవి కూడా ఉండడంతో రక్షణ రంగ అధికారులు పెదవి విరుస్తున్నారు. 1972 తర్వాత ప్రవేశపెట్టిన పలు మెడల్స్ తోపాటు 1999 కార్గిల్ యుద్ధం, 2001-02లో ప్రవేశపెట్టిన ఓపీ పరాక్రమ్ మెడల్‌ కూడా ఈ యూనిఫామ్‌ లో కలిపేయడం విశేషం. ఇక, నేవీ యూనిఫామ్‌ లో భుజాల మీద ఉండే నెల్సన్ రింగ్‌ ను రివర్స్ లో అతికించారు. అప్పట్లో నేవీ అధికారులు గడ్డం లేకుండా మీసం కలిగి ఉండేందుకు అనుమతి లేదు. క్లీన్ షేవ్ ఉండాల్సిందే. ఇక గడ్డం లేకుండా కేవలం మీసాన్ని కలిగి ఉండడాన్ని 1971 తరువాతే నేవీలో అనుమతించారు. ఈ తప్పులన్నీ ఎత్తి చూపడంతో సందీప్ ఉన్నిథాన్‌ పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News