: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ మొదటి స్థానంలో నిలిచిన భారత్
శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచుల్లో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన ఆసిస్‌కి పెద్ద దెబ్బే తగిలింది. టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా టీమ్ ఆ స్థానాన్ని కోల్పోయి మూడో స్థానానికి పడిపోయింది. దీంతో రెండో స్థానంలో ఉన్న భారత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ మొదటి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్ రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలబడక ముందు భారత్ అంతవరకు అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ మళ్లీ మొదటి స్థానానికి ఎగబాకడం పట్ల టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.