: తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల‌ మధ్య వివాదం... ముఖ్యమంత్రిని అపాయింట్‌మెంట్‌ కోరిన ఐఏఎస్‌లు


తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల‌ మధ్య వివాదం రాజుకుంది. త‌మ‌ను కాకుండా ఐపీఎస్‌ల‌ను ప‌లు శాఖ‌లకు క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించ‌డం ప‌ట్ల ఐఏఎస్‌లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అంశంపై వీరు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను క‌ల‌వ‌నున్నారు. దీని కోసం సీఎం అపాయింట్‌మెంట్‌ను వారు కోరారు. ఇప్ప‌టికే సాంఘిక సంక్షేమ శాఖ‌లో ఐపీఎస్ ప్ర‌వీణ్‌కుమార్ ప‌నిచేస్తున్నారు. అంతేగాక పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్‌గా సీవీ ఆనంద్‌ను నియ‌మించడంపై ఐఏఎస్‌లు అసంతృప్తిగా ఉన్నారు. కాగా, ట్రాన్స్ ఫోర్ట్ క‌మిష‌న‌ర్‌గా కూడా ఐపీఎస్‌ను నియ‌మించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంది. దీంతో వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News