: సమీక్షా సమయం!... ‘గడపగడపకు..’ తీరుపై వైఎస్ జగన్ సమీక్ష!


ఏపీలో విపక్షం వైసీపీ చేపట్టిన ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమానికి నేటితో సరిగ్గా నెల నిండింది. అధికార పార్టీ అక్రమాలను ప్రజలకు వివరించేందుకు వైసీపీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కరపత్రాలను ముద్రించిన వైసీపీ వాటిని ఆయా ప్రాంతాల్లోని ప్రజల చేతుల్లో పెడుతోంది. చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటూ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో సదరు కార్యక్రమం కొనసాగుతున్న తీరు, ప్రజల స్పందన, నేతలు ఎంతమేర పాలుపంచుకుంటున్నారు? వంటి అంశాలను తెలుసుకునేందుకు ఓ సమీక్షా సమావేశం పెట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాదులోని లోటస్ పాండ్ లో కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఏపీలోని 13 జిల్లా నాయకత్వం హాజరైంది. గడపగడపకు వైసీపీ తీరుతో పాటు పార్టీ పటిష్ఠతపై కూడా జగన్ సమీక్షించనున్నారు.

  • Loading...

More Telugu News