: మంత్రి కేటీఆర్‌ని ఆకట్టుకున్న ‘పెళ్లి చూపులు’ సినిమా
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తెలుగు సినిమా ‘పెళ్లి చూపులు’. తక్కువ బడ్జెట్‌తో రూపొంది మంచి వసూళ్లను రాబడుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వీక్షించారు. ఈ సినిమా బృందం కేటీఆర్ కోసం స్పెషల్ షో వేసింది. కేటీఆర్‌కి ఈ సినిమా చాలా బాగా నచ్చేసింది. ఎంతగా నచ్చిదంటే ఈ సినిమాని ఆయన ట్విట్టర్లో అభింనందించేంతగా! దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను, చిత్ర బృందాన్ని కేటీఆర్ అభినందించారు. కేవలం ప్రశంసించడమే కాదు 'పెళ్లి చూపులు'కి సంబంధించి కొన్ని విషయాలు కూడా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఈ సినిమా అనేక విభాగాల్లో కొత్తదారులు వేసిందని, ఎలాంటి నీతులు చెప్పకుండా 'పెళ్లి చూపులు' అందరిని ఆకట్టుకుంటోందని ఆయన పేర్కొన్నారు. అసాధారణమైన ప్రొఫెషన్స్, మహిళా సాధికారికత, వ్యాపార సామర్ధ్య స్ఫూర్తిని కలిగించడం వంటి చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు.