: వైసీపీ క్రమశిక్షణా కమిటీలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు!


ఏపీలో విపక్షం వైసీపీలో టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడికి కీలక పదవి దక్కింది. పార్టీ క్రమశిక్షణా కమిటీని పునర్ వ్యవస్థీకరించిన పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న 8 మంది సభ్యులతో కొత్త క్రమశిక్షణా కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చోటు దక్కింది. కమిటీలో ఘట్టమనేనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్ లతో పాటు మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున సభ్యులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News