: మరో ‘ట్రావెల్స్’ ప్రమాదం!... ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ‘వినాయక’ బస్సు, ఇద్దరు దుర్మరణం
తెలుగు నేలలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న రాత్రి హైదరాబాదు నుంచి నెల్లూరు బయలుదేరిన వినాయక ట్రావెల్స్ బస్సు పిడుగురాళ్ల వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. వేగంగా దూసుకువచ్చిన బస్సు లారీని బలంగా ఢీకొనడంతో బస్సులోని ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. వేగంగా స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగానే ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.