: ఇదో వింత... తను డ్రైవింగ్ చేస్తున్న కారు కింద తానే పడిన మహిళ!


తాను డ్రైవింగ్ చేస్తున్న కారు కింద తనే ఎలా పడిందన్న అనుమానం వచ్చిందా? అయితే ఇది మీరు చదవాల్సిందే. అమెరికాలోని వాషింగ్టన్ లోని బర్లింగ్టన్ లో ఓ గ్యాస్ స్టేషన్ కు కారులో వచ్చిన ఓ యువతి ఇంధనం నింపించుకుంది. అనంతరం ప్రయాణం ప్రారంభించింది. ఓ జంక్షన్ వద్దకు రాగానే ఇంధనం ట్యాంకర్ కి మూత వేయలేదంటూ పక్కగా వచ్చిన ఓ కారు డ్రైవర్ చెప్పడంతో, ఆ హడావిడిలో కారును, అలాగే గేర్ లో ఉంచి మూత చూసేందుకు కిందికి దిగింది. అయితే, కారు గేర్ లో ఉండడంతో అది ముందుకి కదిలింది. దీనిని గమనించిన ఆమె మళ్లీ కారులో ఎక్కే ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నంలో కారును అందుకోలేక కిందపడింది. దీంతో ఆ కారు ఆమె కాలుపై నుంచి ముందుకు వెళ్లిపోయింది. ఆ జంక్షన్ దాటి చెట్టుకి ఢీ కొట్టి, కారు ఆగింది. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారు పరిగెత్తుకొచ్చి ఆమెను పైకి లేపి సహాయం చేశారు. అయితే ఆమెకు పెద్దగా గాయాలు కాకపోవడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News