: పరీక్షా కేంద్రంలో పురిటి నొప్పులు, బిడ్డను కనొచ్చి పరీక్ష రాసిన యువతి


బీఈడీ పరీక్ష రాయాలనుకొని వెళ్లిన ఓ నిండు చూలాలికి పరీక్ష హాల్ లో నొప్పులు ప్రారంభం కాగా, ఆపై ఆసుపత్రిలో బిడ్డను కని, తిరిగి వచ్చి పరీక్ష రాసి, తన అంకితభావాన్ని చూపిందో యువతి. ఈ అరుదైన ఘటన బీహార్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. రంజు కుమారి అనే యువతి పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటరుకు వచ్చింది. ఆమెకు కాసేపటికే నొప్పులు ప్రారంభం కావడంతో, స్పందించిన అధికారులు దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. అక్కడ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె, ఆ వెంటనే పరీక్ష రాయాలన్న తన కోరికను బయటపెట్టింది. వైద్యులు అంబులెన్స్ ఏర్పాటు చేయగా, అందులోనే పరీక్షా కేంద్రానికి వెళ్లి, దానిలోనే కూర్చుని పరీక్ష రాసింది. ఆమె చూపిన ధైర్యానికిప్పుడు ప్రశంసలందుతున్నాయి.

  • Loading...

More Telugu News