: జీఎస్‌టీ బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేత‌ర రాష్ట్రంగా బీహార్


అన్ని అడ్డంకులను తొల‌గించుకొని రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల్లో ఆమోదం పొందిన వస్తు సేవలపన్ను(జీఎస్‌టీ) సవరణ బిల్లును ఇటీవ‌లే అసోం శాస‌న‌స‌భ ఏకగ్రీవంగా ఆమోదించిన విష‌యం తెలిసిందే. బిల్లును ఆమోదించిన తొలిరాష్ట్రంగా అసోం నిలిచింది. ఈరోజు జీఎస్‌టీ స‌వ‌ర‌ణ బిల్లుకు బీహార్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రంగా, తొలి ఎన్డీయేత‌ర రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఆ రాష్ట్ర వాణిజ్య‌ప‌న్ను శాఖ మంత్రి బిజేంద్ర ప్ర‌సాద్ యాద‌వ్ ఈరోజు బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. స‌భ్యులంద‌రూ అంగీకారం తెల‌ప‌డంతో బిల్లు పాస్ అయింది.

  • Loading...

More Telugu News