: సరిహద్దుల్లో పాక్ సైనికులకు మిఠాయిలు పంచిన భారత జవాన్లు
పంజాబ్ సరిహద్దుల్లో గల వాఘా బోర్డర్ వద్ద సందడి నెలకొంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాఘా బోర్డర్ వద్ద నిర్వహించే బీటింగ్ రిట్రీట్ ను సందర్శించేందుకు భారీ ఎత్తున భారతీయులు చేరుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత సరిహద్దుల్లో పాక్ సైనికులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వేలాదిగా హాజరైన భారతీయులు సైనికుల విన్యాసాలు చూసి కేరింతలు కొట్టారు.