: మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణను లోటులోకి నెట్టిన అసమర్థుడు కేసీఆర్: తెలుగుదేశం నిప్పులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి మిగులు బడ్జెట్ లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తన చేతగాని పాలనతో లోటులోకి నెట్టేసిన అసమర్థుడు కేసీఆర్ అని తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రసంగించారు. ఎందరో మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, వారందరినీ తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో మహిళలకు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల కాంట్రాక్టుల పేరిట ప్రజా ధనాన్ని తన వారికి దోచి పెడుతున్నారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాంట్రాక్టుల్లో వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని రమణ ఆరోపించారు.