: విజయవాడ దుర్గా ఘాట్ లో పాముల కలకలం... భక్తుల బెంబేలు!
కృష్ణా నదిలో భక్తుల పుణ్య స్నానాల నిమిత్తం వివిధ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్న వేళ, ఒడ్డున ఉన్న పుట్టలు, పొదల పైకి నీరు ప్రవహిస్తుండగా, పాములు కొట్టుకువస్తున్నాయి. విజయవాడలోని దుర్గా ఘాట్ లో ఈ ఉదయం గుంటూరు కొత్తపేటకు చెందిన సుమంత్ అనే యువకుడు పాము కాటుకు గురయ్యాడు. అతన్ని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నీటి మట్టం పెరగడంతోనే విష సర్పాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. దుర్గా ఘాట్ లోకి వచ్చిన పామును గజ ఈతగాళ్లు పట్టుకోగా, దాన్ని చూసిన పుష్కర భక్తులు బెంబేలెత్తి, నదిలోకి దిగి స్నానం చేసేందుకు భయపడుతున్నారు.