: అనంత పద్మనాభుని ఆలయ ఖజానా నుంచి రూ. 186 కోట్ల విలువైన బంగారం మాయం!


ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడిగా గుర్తింపు పొందిన కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభుడికి చెందిన ఖజానా నుంచి రూ. 186 కోట్ల విలువైన 769 బంగారు కుండలు అదృశ్యమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) మాజీ ఫైనాన్షియల్ కార్యదర్శి వినోద్ రాయ్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇవి మాయమయ్యాయని ఆయన తెలిపారు. ఈ బంగారు కుండలకు సీరియల్ నంబర్ 1 నుంచి 1988 వరకూ ఇచ్చారని, ప్రస్తుతం 397 మాత్రమే ఉన్నాయని నివేదికలో వెల్లడించిన వినోద్ రాయ్, ఆలయ కమిటీల లెక్కల ప్రకారం, వీటిల్లో 822 కుండలను ఆభరణాల కోసం కరిగించినట్టు ఉందని, వాటిని తొలగిస్తే 1,166 బంగారు కుండలు ఉండాల్సి వుందని తెలిపారు. ఆలయ కమిటీ బలహీనంగా ఉందని, దాన్ని తొలగించాలని కూడా సూచించారు. ఈ నివేదికపై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News