: తమను రెచ్చగొట్టవద్దంటూ 'ఇండిపెండెన్స్ డే' వార్నింగ్ ఇచ్చిన సౌత్ కొరియా
అణ్వాయుధాలను తయారు చేస్తూ, వాటిని పరీక్షిస్తూ ఇరుగు పొరుగు దేశాల్లో ఆందోళనను పెంచుతున్న ఉత్తర కొరియా వైఖరిని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గివున్ హై విమర్శించారు. నేడు దక్షిణ కొరియా స్వాతంత్ర్య దినోత్సవం కాగా, ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, తమను రెచ్చగొట్టవద్దని, దీనివల్ల ఉత్తర కొరియాకే నష్టమని అన్నారు. క్షిపణి విధ్వంసక వ్యవస్థను మరింతగా మెరుగు పరచుకునేందుకు తమ దేశం చేస్తున్న కార్యక్రమాలను ఆమె సమర్థించుకున్నారు. కాగా, జపాన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన తరువాత దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య స్నేహపూర్వక వాతావరణం లేక, ఒకరిపై ఒకరు కత్తులు దువ్వుకుంటున్న సంగతి తెలిసిందే. వీటినే ప్రస్తావించిన పార్క్, ప్రజా నాశనానికి దారి తీసే అణ్వాయుధాల తయారీని వదిలి వేయాలని ఆమె సూచించారు.