: తుని సమీపంలోని పెట్రోల్ బంక్ లో తప్పిన పెను ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని పెట్రోలు బంక్ లో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై ఉన్న ఓ పెట్రోలు బంక్ లో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ లో పెట్రోలు నింపుతుండగా అగ్గిరాజుకుంది. ఒక్కసారిగా పెట్రోలు ట్యాంక్ నుంచి అగ్నికీలలు ఎగసి పడడంతో అంతా ఆందోళన చెందారు. చూస్తుండగానే క్షణాల్లో ఎన్ ఫీల్డ్ నుంచి వెనకున్న వేరే బైక్ కు కూడా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మెరుపులా కదిలిని సిబ్బంది అక్కడున్న అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి మంటలను ఆర్పివేశారు. లేని పక్షంలో పెను ప్రమాదం సంభవించి ఉండేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.