: డెక్కల బాబు నుంచి మాకు రక్షణ కల్పించండి: యాదగిరి కుటుంబ సభ్యులు


డెక్కల (డాకూరి) బాబు నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఓల్డ్ బోయిన్ పల్లిలో తుపాకీ కాల్పులకు గురైన కాంగ్రెస్ నేత యాదగిరి కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. డెక్కల బాబు ఎవరో తమకు తెలియదని వారు తెలిపారు. డెక్కల బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలని వారు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో యాదగిరి కుమార్తె పోటీ చేయడంతో, తమ కుటుంబ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేని ప్రత్యర్థులు బాబుకు సుపారీ ఇచ్చి హత్య చేయాలని పురమాయించి ఉంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. బాబుతో తమకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News