: 'గౌతమీ పుత్ర శాతకర్ణి' నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోవడానికి కారణమిదేనట!


తెలుగు చిత్ర సీమలో చిరంజీవి 150వ చిత్రం, బాలకృష్ణ 100వ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్, చిరంజీవి చిత్రాన్ని కొనసాగించి, తాజాగా బాలయ్య చిత్రాన్ని వదులుకోవడం ఒకింత సంచలనమే కలిగించింది. దాదాపు నెల రోజుల క్రితమే తాను 'గౌతమీ పుత్ర శాతకర్ణి' నుంచి దేవి తప్పుకోగా, ఇప్పుడే ఆ విషయం బయటకు వచ్చింది. తన తండ్రి మరణించి ఏడాది అవుతున్న సందర్భంగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో కలసి ఓ ప్రత్యేక కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్న దేవీ, ఆ పనుల్లో బిజీగా ఉన్న కారణంగానే ప్రతిష్ఠాత్మక 'గౌతమీ పుత్ర శాతకర్ణి' నుంచి తప్పుకున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి మాత్రం దేవి పనిచేస్తూ, మంచి ట్యూన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడట.

  • Loading...

More Telugu News