: కాశ్మీర్ విముక్తి కోసం స్వాతంత్ర్య దినోత్సవాలు అంకితం... మరోసారి నోరు పారేసుకున్న పాక్


పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కాశ్మీర్ విముక్తి కోసం అంకితం చేస్తామని భారత్ లో ఆ దేశ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం వేడుకలు 'కాశ్మీర్ స్వాతంత్ర్యం' పేరిట జరుగుతాయని ఆయన తెలిపారు. మరోవైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లోయలో జరుగుతున్న పోరాటానికి తాము మద్దతిస్తామని చెబుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వేళ, కాశ్మీర్ ఉద్యమాన్ని తలచుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఇండియాకు ఆగస్టు 15న స్వాతంత్ర్యం రాగా, అంతకు ఒక రోజు ముందు పాక్ కు స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News