: తెలుగుదేశంలో చేరే సమస్యే లేదు: వైకాపా ఎమ్మెల్యే రోజా


తాను మరోసారి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నగరి ఎమ్మెల్యే, వైకాపా నేత రోజా వ్యాఖ్యానించారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె, బయటకు వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెదేపాలోకి తాను ఫిరాయించనున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. కొందరు పనిగట్టుకుని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా పుష్కరాలు జరుగుతున్న వేళ, చంద్రబాబు సర్కారు నదిలోకి మురుగు నీటిని వదులుతోందని, దీని వల్ల వచ్చే రోగాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News