: చివరి రోజు ఆట... విండీస్ చేతిలో 7 వికెట్లు... చేయాల్సిన పరుగులు 313
విండీస్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్, విండీస్ జట్లు హోరాహోరీ ఆడుతున్నాయి. టీమిండియా విజయం కోసం ఆడుతుండగా, విండీస్ కనీసం డ్రా చేసుకుని సిరీస్ లో జీవం నింపేందుకు ప్రయత్నిస్తోంది. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 353 పరుగులకే పరిమితమైన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 217/7 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 345 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ కు టీమిండియా బౌలర్లు నాలుగు పరుగులకే రెండు వికెట్లు పడగొట్టి ఝలక్కిచ్చారు. లియోన్ జాన్సన్ ను షమి అవుట్ చేయగా, సిరీస్ ఆద్యంతం రాణించిన బ్రాత్ వైట్ (4) ను భువనేశ్వర్ పెవిలియన్ బాటపట్టించాడు. అనంతరం శామ్యూల్స్ (12) ను ఇషాంత్ శర్మ అవుట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 225 పరుగులు చేసిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. విజయానికి విండీస్ 308 పరుగుల దూరంలో, భారత్ ఏడు వికెట్ల దూరంలో నిలిచాయి.