: ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ కు వీసా నిరాకరణపై వివరణ ఇచ్చిన యూకే హోం శాఖ
ప్రఖ్యాత సరోద్ విద్వాంసుడు ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ కు వీసా నిరాకరించడంపై యూకే హోంశాఖ వివరణ ఇచ్చింది. సెప్టెంబర్ 17, 18న లండన్ లో నిర్వహించే దర్బార్ ఫెస్టివల్ లో ప్రదర్శన ఇచ్చేందుకు అంజద్ అలీ ఖాన్ యూకే వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. దీంతో 1970ల నుంచి యూకేలో ప్రదర్శనలిస్తున్న తనకు వీసా నిరాకరించడం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో బ్రిటన్ హోం శాఖాధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ నియమాలకు అనుగుణంగా ఆయన వీసా దరఖాస్తు లేకపోవడంతో అధికారులు ఆయనకు వీసాను నిరాకరించారని తెలిపారు. అయితే ఏ నిబంధనకు అనుగుణంగా ఆయన దరఖాస్తు లేదో తెలపలేదు.