: భారత్ లో స్వర్ణపతకంతో అడుగుపెడతా!: బాక్సర్ వికాస్ కిషన్ ధీమా
75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో భారత బాక్సర్ వికాస్ కిషన్ తదుపరి పోరుకు సంసిద్ధమవుతున్నాడు. నిన్న జరిగిన ప్రీ క్వార్టర్స్ లో టర్కీ బాక్సర్ ఒండర్ సిపాల్ పై విజయం సాధించిన అనంతరం మాట్లాడుతూ, రియో ఒలింపిక్స్ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరగాలన్న ఆలోచన తనకు లేదని అన్నాడు. అలాగని రజత పతకం లేదా కాంస్యపతకంతో సరిపెట్టుకునే కోరిక కూడా లేదన్నాడు. భారత్ లో స్వర్ణపతకంతో అడుగుపెట్టాలని ఉందని అన్నాడు. కాగా, వికాస్ కిషన్ తరువాతి మ్యాచ్ లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమిర్ మెలికుజీవ్ తో తలపడనున్నాడు. గ్రూప్ విభాగంలో ఇతను బలమైన, కచ్చితమైన పంచ్ లతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ ఒక్కడిని కనుక క్వార్టర్ ఫైనల్ లో ఓడిస్తే తాను స్వర్ణంతోనే భారత్ లో అడుగుపెడతానని స్పష్టం చేశాడు.