: రాష్ట్రాభివృద్ధికి కొందరు ఉన్మాదుల్లా అడ్డుపడుతున్నారు: ముఖ్యమంత్రి చ‌ంద్ర‌బాబు


ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షాల‌పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి అడ్డుప‌డుతూ కొంద‌రు ఉన్మాదుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. తాము ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన‌ అమ‌రావ‌తి ప‌నుల‌ను అడ్డుకునేందుకు కుట్ర‌ప‌న్నుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీలో ప‌నిచేసే ఏబీకే ప్ర‌సాద్ రాజ‌ధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నంపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింద‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు. న్యాయ‌స్థానం తీర్పుతోనైనా వైసీపీ బుద్ధి తెచ్చుకోవాల‌ని చంద్రబాబు అన్నారు. తాము రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌ర‌చేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తోంటే, ప్ర‌తిప‌క్షాలు మాత్రం వాటిని అడ్డుకునేందుకు చూస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News