: బీజేపీ నేతపై దాడిలో... యూపీ లేడీ కానిస్టేబులే సూత్రధారి?


ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేత బ్రిజ్ పాల్ టియోటియాపై గురువారం గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఘజియాబాదులో కారులో వెళుతున్న బ్రిజ్ పాల్ పై మెరుపు దాడికి దిగిన దుండగులు ఏకే 47 మెషీన్ గన్ తో ఏకంగా వందకు పైగా రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... పోలీసు శాఖలోనే కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సునీత అనే మహిళను కూడా అరెస్ట్ చేశారు. గ్యాంగ్ స్టర్ గా గతంలో యూపీని గడగడలాడించిన రాకేశ్ హసన్ పూరియా భార్యే సునీత. పోలీసుల ఎన్ కౌంటర్ లో రాకేశ్ హతం కాగా, నాటి ఘటనకు బ్రిజ్ పాలే కారణమని సునీత కుటుంబం ఆరోపిస్తోంది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రిజ్ పాల్ కు వ్యతిరేకంగానూ సునీత కుటుంబం ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో బ్రిజ్ పాల్ పై జరిగిన దాడిలో సునీతే కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News