: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీలో పూర్తి స్థాయిలో 12 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీలో చేరుతున్న 8,800 క్యూసెక్కుల నీరును, కృష్ణా డెల్టాకు 3,400, పశ్చిమ డెల్టాకు 5,400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. కాగా, బ్యారేజీపై రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. సీతానగరం నుంచి విజయవాడ మధ్య యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీపై ట్రాఫిక్ ఆంక్షలపై నిన్న యాత్రికులు, స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పునరుద్ధరించామని ఈ సందర్భంగా ఐజీ సంజయ్ చెప్పారు. పాదచారులు, ద్విచక్ర వాహనదారులను బ్యారేజీపైకి అనుమతిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నామని సంజయ్ పేర్కొన్నారు.