: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద!... 874 అడుగులకు చేరిన నీటి మట్టం!


శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వరదల కారణంగా గడచిన కొన్ని రోజులుగా జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో నేటి ఉదయం 7 గంటల సమయానికి... జలాశయంలో 158.63 టీఎంసీల నీరు చేరింది. ఇక జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం 873.9 అడుగులకు చేరింది. ఇప్పటికీ జలాశయానికి 1,51,228 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 81,709 క్యూసెక్కుల నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. ఇదే తరహాలో నీటి ప్రవాహం కొనసాగితే త్వరలోనే జలాశయం పూర్తిగా నిండనుంది.

  • Loading...

More Telugu News