: పుష్కరాల్లోనూ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం!... ఎడమ పాతాళగంగలో పురోహితుల మధ్య వాగ్వాదం!


రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొంటున్న వివాదాలకు కృష్ణా పుష్కరాలు కూడా వేదికయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పరిధిలోని ఎడమ పాతాళగంగలో పౌరోహిత్యానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పురోహితుల మధ్య నిన్న తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎడమ పాతాళగంగ తెలంగాణ పరిధిలోకే వస్తుంది. అయితే పుష్కరాల సందర్భంగా అక్కడ పౌరోహిత్యం చేసేందుకు ఏపీకి చెందిన 45 మంది పురోహితులు నిన్న అక్కడకు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే అక్కడకు చేరుకుని ఏపీ పురోహితులను వారు అడ్డుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన భూభాగంలో మీరెలా పౌరోహిత్యం చేస్తారంటూ వాదనకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News