: అనంతపురంలోనూ కృష్ణమ్మ... పుణ్యస్నానాలు చేస్తున్న ప్రజలు


అనంతపురం జిల్లాలోనూ కృష్ణా పుష్కరాల సందడి కనిపిస్తోంది. కృష్ణా నదేలేని అనంతపురంలో పుష్కరాలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం పెరిగిన తరువాత హంద్రీనీవా ద్వారా కృష్ణా నీటిని రాయలసీమకు వదలగా, ఆ నీరు జీడిపల్లి రిజర్వాయర్ కు వచ్చి చేరడం ప్రారంభమైంది. దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలు జీడిపల్లి జలాశయంలోనే కృష్ణమ్మకు పూజలు చేస్తూ, పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. వ్యయ ప్రయాసలతో విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లలేమని భావించే వారంతా ఇక్కడ స్నానాలకు వస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జలాశయం లోపలికి వెళ్లకుండా భక్తులను ఆపేందుకు బారికేడ్లు పెట్టారు.

  • Loading...

More Telugu News