: రెండు నెలల్లో 530 శాతం రాబడి... 42 వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్ ను తాకిన ఏకైక సంస్థగా శ్రీరామ్ పిస్టన్ అండ్ రింగ్స్


స్టాక్ మార్కెట్లో దూసుకెళ్లే కంపెనీలను పట్టుకోవడం అంత తేలిక కాదు. ఇన్వెస్టర్ల రాబడిని ఇబ్బడి ముబ్బడిగా పెంచే కంపెనీలు ఎన్నో ఉంటాయి. ఎటొచ్చీ వాటి గమనాన్ని పరిశీలిస్తూ, అందిపుచ్చుకోవడమే ఇన్వెస్టర్లు చేయాల్సిన పని. అలాంటి వాటిల్లో ఒకటే శ్రీరామ్ పిస్టన్ అండ్ రింగ్స్. ఈ సంవత్సరం జూన్ 9న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో తొలిసారిగా లిస్టింగ్ అయిన ఈ సంస్థ 42 వరుస సెషన్లలో అప్పర్ సర్క్యూట్ ను తాకింది. నమ్ముకుని వాటాలు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు 530 శాతం లాభాన్ని అందించింది. రూ. 385 వద్ద తొలి రోజు ట్రేడ్ అయిన ఈ కంపెనీ ఈక్విటీ విలువ ఇప్పుడెంతో తెలుసా? ఆగస్టు 11 నాటి సెషన్లో సంస్థ ఈక్విటీ విలువ రూ. 2,427. శ్రీరామ్ పిస్టన్ అండ్ రింగ్స్ మార్కెట్ క్యాప్ విలువ రూ. 5,716 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో 34.76 శాతం నిర్వహణా లాభం, 87 శాతం నికర లాభ వృద్ధిని ప్రకటించింది. పరిశ్రమ సరాసరితో పోలిస్తే, ఎన్నో విభాగాల్లో మెరుగైన పనితీరును కనబరిచింది. గత మూడు సెషన్లుగా ఈ కంపెనీ ఈక్విటీలను విక్రయించి లాభాలు స్వీకరించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఈక్విటీ కదలికలను మార్కెట్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News