: రాజేంద్రనగర్ న్యాయస్థానంలో నయీమ్ ఆస్తుల అప్పగింత
చేసిన పాపాలు పండిపోవడంతో గ్యాంగ్‌స్టర్ నయీమ్ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో ఇటీవలే పోలీసుల చేతిలో హతమైన సంగతి విదితమే. నయీమ్ కు చెందిన ఇళ్లు, అతడి బంధువుల ఇళ్లలో నిర్వహించిన పోలీసుల సోదాలతో నయీమ్ కి పెద్ద ఎత్తున ఆస్తులున్నట్లు తేలింది. ఆయన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు నగదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఈరోజు నార్సింగి పోలీసులు రాజేంద్రనగర్ న్యాయస్థానంలో అప్పగించారు.