: బాలుడితో 'లిప్ లాక్'... వివాదాన్ని కొని తెచ్చుకున్న నయనతార


గతంలో ఓ మద్యం షాపు వద్ద లిక్కర్ కొనుగోలు చేస్తూ వీడియోకు దొరికి పోయి విమర్శలు కొని తెచ్చుకున్న నటి నయనతార, తాజాగా మరోసారి వివాదాస్పదమైంది. ఓ స్కూలు విద్యార్థికి ఆమె లిప్ కిస్ ఇచ్చినట్టు ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ తమిళ చిత్రంలో ఈ సీన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఓ స్కూలును సందర్శించిన వేళ, వరుసగా వచ్చే బాలలకు చాక్లెట్లు ఇస్తూ, వారితో ముద్దులు పెట్టించుకుంటున్న సీన్ లో, ఓ బాలుడికి ముద్ద పెట్టే వేళ, అసంకల్పితంగానే లిప్ లాక్ జరిగినట్టు కనిపిస్తున్నా, కొందరు నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదే ఘటన రివర్స్ అయితే పరిస్థితి ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ఓ పురుషుడు, అదే వయసున్న బాలికతో లిప్ లాక్ చేస్తే దాన్ని కూడా సరదాగా తీసుకుంటారా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది.

  • Loading...

More Telugu News