: మెక్సికోలో కళ్లు తెరిచిన జీసస్ విగ్రహం!... అద్భుతమంటున్న భక్తులు... సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మెక్సికోలో నిజంగా అద్భుతమే జరిగిందంటున్నారు ఆ దేశ క్రైస్తవులు. మెక్సికోలోని ఓ చర్చిలో ఏర్పాటు చేసిన జీసస్ విగ్రహం కళ్లు తెరిచింది. కళ్లు తెరచుకుని ఉన్నట్లే రూపొందించిన సదరు విగ్రహం లిప్త పాటు కాలంలో కళ్లు మూసి తెరచింది. అశ్చర్యకరమైన ఈ సన్నివేశం వీడియోలోనూ రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎక్కిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న మెక్సికో క్రైస్తవులు సదరు చర్చికి తండోపతండాలుగా వెళుతున్నారు. ఇక దీనిపై సమాచారం అందుకున్న శాస్త్రవేత్తలు కూడా విగ్రహం కళ్లు తెరవడానికి గల కారణాలను అన్వేషించే పనిని ప్రారంభించారు.