: గుంటూరు జిల్లాలో పుష్కర ఘాట్లకు ఉచిత బస్సు సర్వీసులు
గుంటూరు జిల్లాలో కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 80 పుష్కర ఘాట్లు, యాత్రికుల కోసం 18 పుష్కర్ నగర్ లు ఏర్పాటు చేశారు. అమరావతి, సీతానగరం పుష్కర ఘాట్లు ఏ+ గ్రేడ్ ఘాట్లుగా గుర్తించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 905 ఆర్టీసీ బస్సు సర్వీసులు, యాత్రికుల కోసం 140 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని 3 పుష్కర నగర్ల నుంచి, మంగళగిరి ఎయిమ్స్ నుంచి సీతానగరం ఘాట్ల వరకు, కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ నుంచి ఉండవల్లి క్రాస్ రోడ్డు, సీతానగరం మహానాడు వరకు ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.