: భారత్ మార్కెట్ లోకి కొడాక్ టీవీలు
అమెరికాకు చెందిన కొడాక్ సంస్థ టీవీలు భారత్ టీవీ మార్కెట్లోకి వచ్చాయి. నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎల్ఈడీ టీవీలను ప్రవేశపెట్టింది. 32, 40, 50 అంగుళాల మోడళ్లలో మొత్తం ఐదు టీవీలను ఈరోజు విడుదల చేసింది. ఈ టీవీల ప్రారంభ ధర రూ.13,500గా ఉంది. ఆన్ లైన్ మార్కెట్ పోర్టల్ 'షాప్ క్లూస్'లో ఈ టీవీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొడాక్ గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్టీవెన్ ఓవర్ మన్ మాట్లాడుతూ, ‘సూపర్ ప్లాస్ట్రోనిక్స్’తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 4కే, కర్వ్ డ్ టీవీలను విడుదల చేస్తామని చెప్పారు.