: సినిమాలో వేలు పెట్టను...డైరెక్టర్ విజన్ చూస్తాను: ధోనీ


'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' పేరిట రూపొందిన సినిమాలో వేలు పెట్టనని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తెలిపాడు. ఈ సినిమా ట్రైలర్ ను ఆవిష్కరించిన సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమాలో ఆయన విజన్ ను చూస్తానని అన్నాడు. ఈ సినిమా తీస్తానని నీరజ్ పాండే చెప్పినప్పుడు తనకు చాలా ప్రశ్నలు వేశాడని ధోనీ గుర్తు చేసుకున్నాడు. తాను క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకోవడం, జాతీయజట్టులో చోటు సంపాదించడంపై తన తల్లిదండ్రుల స్పందన ఏంటో తనకు తెలియదని, ఈ సినిమా ద్వారా వాటిని తెలుసుకునే అవకాశం కలిగిందని దోనీ చెప్పాడు. తనకు స్కూల్ రోజులు ఎప్పుడూ ప్రత్యేకమేనని చెప్పిన ధోనీ, ఆ రోజుల్లో నేను క్రికెట్ ఆడగలనని ప్రోత్సహించిన కోచ్ కారణంగానే తన కెరీర్ ప్రారంభమైందని అన్నాడు. సినిమా చూడడానికి ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు.

  • Loading...

More Telugu News