: ఐశ్వర్య పోస్టర్లు యువతపై చెడు ప్రభావం చూపుతాయంటూ తొలగించేశారు!
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ పోస్టర్లు యువతపై చెడు ప్రభావం చూపుతాయంటూ వాటిని వెంటనే తొలగించిన సంఘటన మలేషియాలో జరిగింది. మలేషియాలోని ఒక వాచీల దుకాణం ఐశ్వర్యారాయ్ ఫొటో ఉన్న పోస్టర్ ను తమ షాపు ముందు పెట్టుకుంది. ఆ పోస్టర్ లో వాచీ ధరించిన ఐశ్వర్య ఎంతో అందంగా ఉంది. అయితే, ఇంత అందమైన పోస్టర్లు యువతపై చెడు ప్రభావం చూపుతాయని, వాటిని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులు ఆ షాపు యజమానిని ఆదేశించారు. ఆ పోస్టర్లను తయారీ దారుల నుంచి తెప్పించుకున్నామని, వాటిని తొలగించే ప్రశ్నే లేదని సదరు యజమాని చెప్పాడు. అయినప్పటికీ, వాటిని తొలగించాల్సిందేనన్న అధికారుల ఆదేశాలకు తలొగ్గాల్సి వచ్చింది. ఆ పోస్టర్లను తొలగింపజేయడమే కాకుండా ఆ షాపుకు జరిమానా కూడా విధించారు. దీంతో, అందమైన పోస్టర్లను షాపు ముందు ఉంచితే, వ్యాపారం పెరుగుతుందనుకున్న యజమాని తీవ్ర నిరాశకు గురికావాల్సి వచ్చింది.