: రోలర్ కోస్టర్ సెషన్ లో స్వల్ప లాభాలు


సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల లాభం, ఆపై నిమిషాల వ్యవధిలో 100 పాయింట్ల నష్టం, తిరిగి అరగంటకు లాభాల్లోకి, మధ్యాహ్నం తరువాత భారీ నష్టం దిశగా, చివరి అరగంట వ్యవధిలో కొనుగోళ్లతో రికవరీ... ఇలా సాగింది గురువారం నాటి భారత స్టాక్ మార్కెట్. ఓ వైపు అమ్మకాలు, మరోవైపు కొనుగోళ్లు సాగుతున్న వేళ సెషన్ ఆసాంతం రోలర్ కోస్టర్ ను తలపించేలా సాగింది. బెంచ్ మార్క్ ఇండెక్స్ లతో పోలిస్తే, చిన్న, మధ్య తరహా కంపెనీల ఈక్విటీల్లో అమ్మకాలు అధికంగా కనిపించాయి. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 84.72 పాయింట్లు పెరిగి 87.72 శాతం లాభంతో 27,859.60 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 16.85 పాయింట్లు పెరిగి 0.20 శాతం లాభంతో 8,592.15 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.03 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.02 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 27 కంపెనీలు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, ఐడియా, బీపీసీఎల్, లుపిన్, ఐటీసీ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రాసిమ్, జడ్ఈఈఎల్, ఇన్ ఫ్రాటెల్, హిందాల్కో తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,843 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,167 కంపెనీలు లాభాలను, 1,518 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,08,13,028 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News