: చంద్రబాబు ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలని పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు!: వైఎస్సార్సీపీ నేతల ఆరోపణ


రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్సీపీ నేతలు తమ సొంత భవనాలపై తమ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై పోలీసులు ఆంక్షలు విధిస్తూ, ఆ ఫ్లెక్సీలను తీసివేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేష్, నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వ్యవహార సరళిపై వారు నిరసన తెలిపారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత ఏర్పడింది. పుష్కర భక్తులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు కేవలం సీఎం చంద్రబాబువి మాత్రమే ఉండాలని పోలీసులు చెబుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు.

  • Loading...

More Telugu News