: నయీమ్ కేసులో నల్గొండ జిల్లాలో ఓ మాజీమంత్రి ప్రమేయంపై దర్యాప్తు సాగుతుంది: నాయిని
పాపాలు పండి పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు అంశంపై తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ కేసులో ఎంతటి పెద్దవాళ్లనైనా వదిలిపెట్టబోమని అన్నారు. కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే నయీమ్ కేసుపై నాగిరెడ్డి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో ఓ మాజీమంత్రి ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు.