: రూ.300 చెల్లిస్తే మన ఫొటోతో స్టాంపులు... పోస్టల్ శాఖ పుష్కరాల ఆఫర్!
కృష్ణా పుష్కరాల సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేక సేవలను భక్తులకు అందించనుంది. రూ.300 చెల్లిస్తే సొంత ఫొటోతో ఉన్న 12 స్టాంపులను వెంటనే అందజేసేందుకు ముందుకు వస్తోంది. సదరు వ్యక్తి డబ్బులు చెల్లించిన వెంటనే వారి ఫొటోతో ఉన్న స్టాంపులను ఇచ్చేలా ఒక ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్ లో పోస్టల్ శాఖ ఈ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ స్టాంపులను కవర్లపై అతికించి ఉపయోగించుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో పాటు, పుష్కర జల్ ను భక్తులకు అందించేందుకు కూడా పోస్టల్ శాఖ సిద్ధమవుతోంది. వనపర్తి పరిధిలో 2600 మంది, మహబూబ్ నగర్ పరిధిలో 2100 మంది భక్తులు పుష్కర జల్ నిమిత్తం బుకింగ్ చేసుకున్నారు.