: నయీమ్ బెడ్ రూంలో అధునాతన సైనైడ్ గన్!.... శాటిలైట్ ఫోన్ కూడా!


పోలీసుల సహకారంతోనే కరుడుగట్టిన నేరగాడిగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ నయీమ్... తదనంతర కాలంలో పోలీసులకే పెను సవాల్ గా మారాడు. ఏకంగా 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న అతడు... అత్యాధునిక మారణాయుధాలతో పాటు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన సమాచార సాధనాలను కూడా సముపార్జించుకున్నాడు. హైదరాబాదులోని అలకాపురిలో ఉన్న అతడి ఇంటిలోని బెడ్ రూంను నిన్న బద్దలు కొట్టిన పోలీసులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చారు. నయీమ్ బెడ్ రూంలో పోలీసులు సోదా చేయగా... అత్యాధునిక సైనైడ్ గన్ తో పాటు శాటిలైట్ ఫోన్ కూడా దొరికింది.

  • Loading...

More Telugu News