: జోరు కొనసాగించిన అశ్విన్!... కరీబియన్ గడ్డపైనే రెండో సెంచరీ నమోదు చేసిన స్పిన్నర్!


టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ లో సత్తా చాటుతున్నాడు. కరీబియన్ పర్యటనలో జూలు విదిల్చిన అశ్విన్.. తన కెరీర్ లోనే తొలి సెంచరీని నమోదు చేశాడు. తాజాగా రెండో సెంచరీని కూడా అతడు అదే గడ్డపై సాధించాడు. వెరసి టీమిండియాకు సమర్థుడైన ఆల్ రౌండర్ లేని లోటును అతడు తీర్చేశాడు. వెస్టిండిస్ తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా నిన్న నైట్ వాచ్ మన్ గా భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించిన అశ్విన్ (118) కెరీర్ లో రెండో సెంచరీని నమోదు చేశారు. వంద పరుగుల మైలురాయి చేరకముందే నాలుగు టాపార్డర్ వికెట్లు పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. వృద్ధిమాన్ సాహా (104)తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సాధించిపెట్టాడు.

  • Loading...

More Telugu News