: ఏపీకి త్వరలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ?
ఏపీకి త్వరలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ సాయం చేయాలనే దానిపై కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం. మిగిలిన రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏపీకి సాయం చేయడంపై, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తయారు చేసిన ప్యాకేజీపైనా ఆర్థిక శాఖ దృష్టి సారించిందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్యాకేజీ లెక్కల జాబితాను ఏపీ అధికారులు కేంద్రానికి అందజేశారు. ఒకట్రెండు రోజుల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈ విషయమై చర్చలు జరగనున్నాయని సమాచారం. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీపై వచ్చే వారంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.